పాదాలకు గ్రీన్ టీ

అందమే ఆనందం

ముఖానికి, ఆరోగ్యానికి, బరువును అదుపులో ఉంచుకోవటానికి గ్రీన్ టీ మంచిదని తెలుసు… ఇది పాదాల అందాన్ని పెంచుతుందని తెలుసా?…

Foot
Foot

ఒక బేసిన్ లో వేడి నీటిని తీసుకుని 3-4 గ్రీన్ టీ బ్యాగులను వేయండి.. పాదాలను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక టీ బ్యాగులను తీసేసి బాత్ సాల్ట్ ను చేర్చి పాదాలను అందులో ఉంచండి.. 15 నిముషాలు అయ్యాక ప్యూమిస్ స్టోన్ తో మృతకణాలను తొలగించి, కళ్ళను చల్లని నీతితో శుభ్రం చేసుకోవాలి.. ఆపై మాయిశ్చరైసింగ్ చేస్తే సరి..
గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు ఎక్కువ. ఎండ, చెమట కారణంగా, ఏర్పడే అలర్జీలను దూరం చేస్తాయి.. దీనిలో వుండే ఇ విటమిన్ పాదాలకు తేమను అందిస్తుంది..
వేడి కారణంగా, చాలామందికి పాదాలపై చర్మం ఒకే రంగులో ఉండదు.. ట్యాస్ కూడా ఎక్కువగా కన్పిస్తుంది.. గ్రీన్ టీలో ఉండే విటమిన్ సి వీటికి చెక్ పెడుతుంది..

ఆధ్యాత్మికం వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/devotional/