ప్రభుత్వసాయం ఉంటే నో గ్రీన్‌కార్డు!

GREEN CARD
GREEN CARD

ప్రభుత్వసాయం ఉంటే నో గ్రీన్‌కార్డు!

ట్రంప్‌ యంత్రాంగం కొత్త నిబంధన

వాషింగ్టన్‌: చట్టబద్ధమైన నిబందనలను అనుసరించి వీసా పొందినా వారు ఏదైనా ప్రభుత్వ సాయం పొందుతున్న ట్లయితే వారికి గ్రీన్‌కార్డు రానేరాదని ట్రంప్‌ యంత్రాంగం కొత్త నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వారికి సామాజిక ప్రయోజ నాలు కూడా ఉండవని తేలింది. శాశ్వత నివాసం కోసం లేదా గ్రీన్‌కార్డు ఇవ్వడానికి వీలులేదన్న నిబంధనను ట్రంప్‌ ప్రభుత్వం తెస్తోంది. కొత్త మార్గదర్శకాలనుసైతం ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ ఉన్న గ్రీన్‌కార్డు దారులకు అద్దె ఇళ్లలో సబ్సిడీలు,ఫుడ్‌స్టాంప్స్‌వంటివి ఇకపై ఉండవు. అయితే ఇప్పటికే గ్రీన్‌కార్డు ఉన్నవారికి ఈ కొత్త నిబంధనలు వర్తించవు. అమెరికా అంతర్గత సెక్యూరిటీ విభాగం తన వెబ్‌సైట్‌పై ఈ నిబంధనలను పొందుపరిచింది. దీనివల్ల కొన్ని మిలియన్ల మంది నివాసితులు అంటే వలసవాదులు ప్రభుత్వ సాయం పొందేవారికి ఇకపై గ్రీన్‌కార్డు రానిపరిస్థితి ఉత్పన్నం అవుతున్నది. గ్రీన్‌కార్డుపొంది చట్టబద్ధంగా అమెరికాలో నివసించే హక్కునుసైతం కోల్పోతున్నారు. తక్కువవ్యయంతో ఉన్న ఔషధాలు, మెడికేర్‌ పార్ట్‌ డి కింద ఉన్న లబ్దిదారులు కూడా తమ ఆరోగ్య సదుపాయాలను కోల్పోవలసి ఉంటుంది. అమెరికా పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తున్న విమర్శలకు జవాబుగా ట్రంప్‌ యంత్రాంగం వీరినిసైతం శాశ్వత నివాసం కేటగిరికిందకు తీసుకురాలేదు. ఈ ప్రతిపాదన వల్ల సుమారు 3.82 లక్షలమంది వలసవాదులకు సాలీనా ఇబ్బందులు ఎదురవుతాయి.చట్టపరంగా అమెరికాకు వలసవచ్చే విధానాన్ని కుదించే లక్ష్యంతోట్రంప్‌ప్రభుత్వం ఈ ఆంక్షలు విధిస్తోంది. కొత్త మార్గదర్శకాలు కేవలం స్వయంసమృద్ధిని పెంచేందుకేనని, అమెరికా పన్నుచెల్లింపుదారుల ప్రయోజనాలకేనని హోంల్యాండ్‌సెక్యూరిటీ వెల్లడించింది.