గడ్డి అన్నారం మార్కెట్‌కు భారీగా వచ్చిన మామిడి

నేటి అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు మార్కెట్‌ను మూసివేయనున్న అధికారులు

gaddi annaram fruit market
gaddi annaram fruit market

హైదరాబాద్‌: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నేటి అర్ధరాత్రి నుంచి గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ మూడు రోజుల పాటు మూసివేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, మార్కెట్‌ కు రైతులు పోటెత్తారు. ఏకంగా ఈ ఒక్కరోజే 1600 టన్నులకు పైగా మామిడి కాయలు రావడంతో మార్కెట్‌ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. రైతుల ప్రయోజనం కోసం ఈ అర్ధరాత్రి వరకు కొనుగొళ్లు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా రేపటినుండి మూడు రోజుల పాటు మార్కెట్‌ మూసి ఉంటుంది కాబట్టి మామిడికాయలు తేవొద్దని, తెచ్చిన లోపలికి అనుమతించమని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామ్‌నర్సింహగౌడ్‌ తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/