రవివర్మ చిత్రాలపై మనుమరాలి శ్రద్ధ

కళలు-పరిరక్షణ

Ravi Varma’s painting

రాజారవివర్మ గురించి భారతీయుల్లో తెలియని వారుండరు. సంప్రదాయ చిత్రలేఖనంలో ఆయన ఆరంభం ఒక కొత్తమలుపు. నేటికీ ఆ చిత్రాలు ప్రపంచదేశాలకే ఆదర్శమయ్యాయి.

ఆ రవివర్మముని మనుమరాలు రుక్మిణి వర్మ నాట్యకారిణి. భరతనాట్యం, కథక్‌ కథాకళి ప్రదర్శనలు అనేకం ఇచ్చారు. బెంగళూరులో డాన్స్‌ స్కూల్‌, ‘రాజా రవివర్మ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రవివర్మ చిత్రాల ప్రదర్శన మీద ఆమె ముందు నుంచి కృషి చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం డ్రస్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా ఆమెను కలిసి ఒక ప్రతిపాదన చేశారు.

గాంధీజీ 150 జయంతి మరో ఐదేళ్లలో రానున్న సందర్భంగా ఆయనకు నివాళిగా ఖాదీ వస్త్రాల మీద రవివర్మ చిత్రాలను రూపుదిద్దుతాను. అందుకు అంతగా వ్యాప్తిలోకి రాని చిత్రాలు ఇవ్వండి అని ఆ ప్రతిపాదన సారాంశం.

అందుకు సమ్మతించిన రుక్మిణి రవివర్మ చిత్రాల్లో అరుదైన ఇంతవరకు ఎక్కువగా ప్రదర్శితం కాని ముప్పైచిత్రాలను ఇచ్చారు.

ఆ చిత్రాలను ఖాదీ వస్త్రం మీద ఆవిష్కరింప చేయడం అనే మహాయజ్ఞాన్ని తలకెత్తుకున్నారు గౌరంగ్‌.

ఐదేళ్ల సుదీర్ఘ శ్రమ తర్వాత ఆ బొమ్మలను ఖాదీ వస్త్రాల మీదకు తీసుకురాగలిగారు. గాంధీజీ ఫాదర్‌ ఆఫ్‌ నేషన్‌. రవివర్మ ఫాదర్‌ ఆఫ్‌ఆర్ట్‌. ఆ ఇద్దరి జయంతి వర్ధంతి ఒకే రోజు.

Ravi Varma’s painting

గాంధీకి ఇష్టమైన ఖాదీలో రవివర్మ చిత్రాలనురూపొందించడానికి కారణం వాళ్లిద్దరినీ ఒక వేదిక మీదకు తీసుకురావడమే.

ఇందుకోసం రుక్మిణి వర్మను సంప్రదించినప్పుడు ఆమె వినూత్నమైన చిత్రాల హక్కులను ఇచ్చి మరీ ప్రోత్సహించారు. రవివర్మ చిత్రాల డిజిటల్‌ రూపాలను ఖాదీ వస్త్రాల మీద జాందానీ నేతలో పునఃసృష్టించాం.

ఈ బొమ్మలు ఉన్న చీరల మొదటి ప్రదర్శనను 2019 అక్టోబర్‌ రెండవ తేదీన ముంబయిలో పెట్టాం. తర్వాత అహ్మదాబాద్‌, ఢిల్లీలో ప్రదర్శించాం.

ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టాం. వచ్చేనెల బరోడాలో ఉంది. ఇలా దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ఎగ్జిబిషన పెట్టిన తర్వాత విదేశాలకు తీసుకెళ్లాలనేది నా ఆలోచన అన్నారు గౌరంగ్‌ షా.

కేరళ సంప్రదాయ దుస్తులలో వీణ మీటుతున్న సరస్వతి మొదలైన చిత్రాలు చీరల మీద నేతలో ఒదిగిపోయాయి.

ఒక చిత్రంలో కృష్ణుడి ఆస్థానంలో ఇరవైమంది కొలువదీరి ఉన్నారు. ఒక్కొక్కరి ముఖంలో ఒక్కోభావం, కళ్లలో కూడా చిత్రవిచిత్రమైన భావాలు వ్యక్తమవుతు న్నాయి.

ఆ భావాలు చీర మీద కూడా యథాతథంగా రూపుదిద్దుకున్నాయి.

హరిహర బేటీ చిత్రంలో అయితే ఒకే తల రెండుగా భ్రమింపచేస్తుంది. శివుడు అధిరోహించిన నంది వైపు నుంచి చూస్తేనంది తల కనిపిస్తుంది.

విష్ణుమూర్తి వైపు నుంచి చూస్తేఏనుగు తల కనిపిస్తుంది. రవివర్మ చిత్రకళలో చూపించిన ఇంతటి వైవిధ్యాన్ని నేతలో తీసుకురావడానికి నేతకారులకు మూడేళ్లు పట్టింది. 150/150 నేతలో ఆరువందల రంగులను ఉపయెగించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/