మెగా ఫ్యాన్స్ కోసం ‘మెగా కార్నివాల్’ ఫెస్టివల్

ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే డే. ఈ సందర్బంగా మెగా అభిమానుల కోసం మెగా బ్రదర్ ‘మెగా కార్నివాల్’ ఫెస్టివల్ ను ఏర్పటు చేస్తున్నారు. చిరంజీవి పుట్టిన రోజు అంటే అభిమానులకు పెద్ద పండగే. ఆ రోజు అభిమానులు పెద్ద ఎత్తున పలు సేవ కార్య క్రమాలు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈసారి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు నాగబాబు.

ప్రతి సంవత్సరం అన్నయ్య బర్త్ డే శిల్పకళ వేదికలో చేసేవాళ్ళం.. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా ప్లాన్ చేస్తున్నాం అని తెలిపారు, బర్త్ డే వేడుకల్లో అభిమానులు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఎంజాయ్ చేసే విధంగా డిజైన్ చేసినట్లు నాగబాబు చెప్పుకొచ్చారు.

అలాగే అభిమానుల కోసం కార్నివాల్ ఫెస్టివల్ ని కూడా హైటెక్స్ లో ఏర్పాటు చేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఇండియాలో ఏ సినిమా హీరోకి కార్నివాల్ లాంటిది పెట్టలేదు.. ఈ కార్నివాల్ ఫెస్టివల్ అనేది ఫ్యాన్స్ కి ఒక మెమొరబుల్ డే గా వుండాలని తెలిపారు. చాలా ఊర్లలో చిరంజీవి బర్త్ డేను పండుగ లాగా చేసుకుంటారు.. కార్నివాల్ లో అన్ని ప్రాంతాల అభిమానులు పాల్గొనాలని కోరారు. అన్ని సదుపాయాలు ఆ కార్నివాల్ లో ఉంటాయని అభిమానులకు నాగబాబు పిలుపునిచ్చారు. కార్నివాల్ లో చిరంజీవి గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు పంచుకుంటానని నాగబాబు తెలిపారు.