కోహ్లీ ప్రమాదకరంగా మారే అవకాశం

GRAHAM GOOCH-
GRAHAM GOOCH

కోహ్లీ ప్రమాదకరంగా మారే అవకాశం

లండన్‌: ఇంగ్లీష్‌ గడ్డపై గత పర్యటనలో విఫలమైన కోహ్లీ ఈసారి మాత్రం తన రికార్డును మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఆతిథ్య జట్టుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మాజీ కెప్టెన్‌ గ్రాహమ్‌ గూచ్‌ అభిప్రాయపడ్డాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీసేన తలపడనుంది. ఈనేపథ్యంలో బిసిసిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రాహమ్‌ గూచ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్‌ ప్లేయర్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌ జట్టుకు ప్రమాద కరమే. ఎందుకంటే అతను ఇంగ్లాండ్‌లో తన రికార్డును మెరుగుపరుచుకోవాలని ఉవ్వి ళ్లూరుతున్నాడు. ప్రతి ఆటగాడికి విదేశాల్లో రాణించాలని ఉంటుందన్నాడు.

విరాట్‌ కోహ్లీ, జో రూట్‌లలో ఎవరు బెస్ట్‌ అనే చర్చ జరుగుతున్న నేపథ్‌యంలో ఇద్దరూ మ్యాచ్‌ విన్నర్లేనని అన్నాడు. ఇద్దరు ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్రికెటర్‌ ఏ ఫార్మటయినా ఆకలింపు చేసుకుం టున్నాడు. వీరిలో ఎవరు గొప్ప అని చెప్పడం మాత్రం కష్టమే. ఇద్దరూ మ్యాచ్‌ విన్నర్లే. ఇద్దరి ఆటను ఆస్వాదించడానికి ఇష్టపడతాను. పరుగులతో ఎవరు గొప్ప అని చెప్పలేం. పరిస్థిలు తగ్గట్టు ఆడినవారే గొప్పవారు. కొన్ని సందర్భాల్లో సెంచరీల కన్నా హాఫ్‌ సెంచరీలు కూడా కీలకం అవుతాయని గూచ్‌ అన్నాడు. గతంలో కంటే టీమిండియా ప్రదర్శన ఎంతో మెరుగు పడిందని గూచ్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణం గా భారత్‌తో టెస్టు సిరీస్‌ హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు. గత విదేశీ పర్యటనల్లో భారత ఆట దారుణంగా ఉండేది. సొంతగడ్డపై బలంగా ఉండే టీమిండియా…ఇప్పుడు విదేశా ల్లోనూ అద్భుత ఆటను కనబరుస్తోంది. తనను తాను నిరూపించుకోవాలని కోహ్లీ కూడా పట్టుద లతో ఉన్నాడు.