టీనేజ్ లో కి లిటిల్ సూపర్ స్టార్

Mahesh, Namrata with Gowtham
Mahesh, Namrata with Gowtham

గౌతమ్‌ 13లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు అతను టీనేజర్‌” అని సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మహేశ్‌.. గౌతమ్‌కు ఎంతో ఇష్టమైన చాక్లెట్‌ను తినిపించి.. ముద్దు పెట్టుకున్నాడు. నా కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాను మిస్టర్‌ గౌతమ్‌ ఘట్టమనేని’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి దీనితో మహేష్ ఫ్యాన్స్ నుండి గౌతమ్ కి శుభకాంక్షలు వెల్లువెత్తాయి లిటిల్ సూపర్ స్టార్ గౌతమ్ అంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తనకు తెరపై చోడొచ్చంటూ ఆనందం వ్యక్తం చేశారు