చరణ్ సినిమాఎలా ఉంటుందో తెలిపిన గౌతమ్ తిన్ననూరి

‘మళ్లీ రావా’ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్న గౌతమ్ తిన్ననూరి.. రెండో ప్రయత్నంలోనే జెర్సీ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతాడనే వార్తలు గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై గౌతమ్ క్లారిటీ ఇచ్చారు.

త్వరలో సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రాబోతున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఇందులో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత చరణ్ – క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్‌లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ తర్వాత చరణ్..గౌతమ్ సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. రామ్ చరణ్‌తో తాను చేస్తున్నది పాన్ ఇండియన్ సినిమానే అని చెప్పుకొచ్చాడు. అంతకంటే ఎక్కువే ఉంటుందని స్పష్ఠం చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టాడు. అలాగే, ఈ సినిమా కథ కూడా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని రివీల్ చేశాడు. మొత్తానికి రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లు మాత్రం ఒక్కోటి ఒక్కో లెవెల్‌లో ఉండబోతోన్నాయి. శంకర్, గౌతమ్ తిన్ననూరి సినిమాల తరువాత ప్రశాంత్ నీల్‌తో మరో చిత్రం ఉండబోతోందని టాక్. మొత్తానికి రామ్ చరణ్ మాత్రం తన ప్లాన్‌తో అందరినీ ఆశ్చర్యపోతోన్నారు.