పరిశ్రమలకు ముడిసరుకుల కొరత ఏర్పడవచ్చు!

పరిశ్రమలకు సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది

nirmala sitharaman
nirmala sitharaman

గువాహటి: ప్రపంచాన్ని ఆర్థిక వ్యస్థను అతలాకుతలం చేస్తున్న కోవిడ్‌-19 చైనాపై దీని ప్రభావం దీర్గకాలం కొనసాగితే దేశీయ పరిశ్రమలకు ముడి సరుకుల కొరత ఏర్పడవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. గురువారం గువాహటిలో బడ్జెట్‌ 2020-21పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై మంత్రి స్పందిస్తూ..వచ్చే రెండు మూడు నెలల్లో పరిస్థితులు మెరుగుపడకపోతే, ముడి సరుకుల కొరత ఏర్పడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన సాయం చేసేందుకు కసరత్తు జరుగతుందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశంలోని కీలక రంగాలకు అవసరమైన ముడి సరుకులను చైనా నుంచి విమానాల ద్వారా తెప్పిచడంతో పాటు అవసరమైతే ఇతర దేశాల నుంచి సేకరించే ఆలోచనలో ఉన్నామని ఆమె తెలిపారు. ఆయా డిపార్ట్‌మెంట్ల స్థాయిలో వీటిపై కసరత్తు జరుగుతోందని, ఏ రంగానికి ఎలాంటి సాయం అవసరం అన్న విషయంపై అన్ని డిపార్టుమెంట్లలో సమీక్ష జరుపుతామని మంత్రి అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/