ఎయిరిండియా పై ప్రభుత్వం కీలక నిర్ణయం

Air India
Air India

న్యూఢిల్లీ: ఎయిరిండియాను ప్రవేటు పరం చేసే ప్రతిపాదన చర్చల దశలోఉండగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో లార్జ్‌ స్కేల్‌ ప్రమోషన్లు, అపాయింట్మెంట్‌లను నిలిపివేయాలని యాజమాన్యానికి సూచించినట్లు తెలుస్తోంది. కొత్త విమానాలను కూడా అత్యవసరమైతేనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ(దీపం) నుంచి ఈ మార్గదర్శకాలు జారీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ఎయిరిండియా అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు. ఈ ఆదేశాలు వారానికి ముందే వచ్చాయని తెలిపారు. ప్రైవేటీకరణ అసంపూర్తిగా ఉండటంతో..ఎయిరిండియాకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదనేది యాజామన్యం ఉద్దేశమట. అందుకే అపాయింట్మెంట్లు, ప్రమోషన్లను నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/