జీఎస్టీ పరిహారం కింద నిధుల విడుదల..

ఎపీకి 925 కోట్లు, తెలంగాణకు 1,036కోట్లు

nirmala sitharaman
nirmala sitharaman

న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. అన్ని రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీకి రూ.35,298 కోట్ల మేర నిధులను మోడి ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ నెల 18 జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఉంది. ఈ సమావేశానికి ముందే కేంద్రం నిధులు విడుదల చేసింది. కాగా పలు రాష్ట్రాలకు ఆగస్టు, సెప్టెంబర్‌ నుంచి జీఎస్టీ జీఎస్టీ పరిహారం చెల్లింపులు జరగలేదు. దీనిపై బుధవారం జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో రాష్ట్రాలు నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. కానీ కేంద్రం ముందే నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా జీఎస్టీ పరిహారంపై కేంద్రం మాట తప్పదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. జీఎస్టీ వసూళ్లు ఆశించిన మేర రాకపోవడంతో చెల్లింపులు ఆలస్యమవుతోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని, వసూళ్లను పెంచడంతో పాటు రాష్ట్రాలకు పరిహారంపై ఇచ్చిన మాట తప్పమని ఆమె హామీ ఇచ్చారు. వసూళ్లు పెంచడం కోసం అందరం కలిసి పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.35,298 కోట్లు జీఎస్టీ నిధులు విడుదలయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చిన వాటా రూ.925కోట్లు. తెలంగాణకు జీఎస్టీ పరిహారం కింద రూ.1,036 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/