ఆసుపత్రుల్లో ఓపి సేవలు ప్రారంభం

Hospital

హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఓపి (ఔట్‌ పేషెంట్‌ విభాగం) సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడు ఆసుపత్రుల్లో ఓపి సేవలు ప్రారంభమయ్యాయి. నగరంలో జిహెచ్‌ఎంసి పరిధితో పాటు ఇతర జిల్లాల్లోనూ బయటి రోగుల విభాగం సేవలు మొదలైనాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో సుమారు 45 రోజుల తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్‌లో మార్పులు చేసింది. దీంతో ప్రైవేట్, కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు బయట రోగుల సేవలను అందుబాటులోకి తెచ్చాయి. లాక్‌డౌన్ సమయంలో 90 శాతం ఆసుపత్రులు వైద్యసేవలకు బంద్ పెట్టగా, కొన్ని అత్యవసర సేవలను మాత్రమే అందించాయి. అయితే ప్రభుత్వం లాక్‌డౌన్‌లో మార్పులు చేయగా, దాదాపు అన్ని ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఓపి సేవలు అందుబాటులోకి వచ్చా యి. కొన్ని జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో సేవలు ప్రారంభించలేదని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/