మరో మూడు నెలల పాటు ఫ్రీ రేషన్..

రేషన్ దారులకు కేంద్రం మరో తీపి కబురు తెలిపింది. మరో మూడు నెలల పాటు ఫ్రీ రేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. కరోనా అప్పటి నుండి కేంద్రం పేద ప్రజలకు ఉచిత రేషన్‌ను అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. సెప్టెంబర్ 30 తో ఫ్రీ రేషన్ గడువు ముగుస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో పథకం ముగియాల్సి ఉన్నా.. సెప్టెంబర్ 30 వరకు పొడగించారు.

తాజాగా మరో 3 నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాబోయే పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని పెంచినట్లు తెలుస్తోంది. ఈ స్కీం ద్వారా 80 కోట్లకుపైగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఈపథకం వల్ల ప్రభుత్వంపై రూ.45 వేల కోట్ల భారం పడనుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక భారాన్ని కొంతమేర తగ్గించేందుకు రేషన్‌ కింద అందించే ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించే అవకాశం కనిపిస్తోంది.