రేషన్ కార్డు దారులకు మోడీ శుభవార్త

రేషన్ కార్డు దారులకు తీపి కబురు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ స్కీమ్‌ను మరింత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్నా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచిత రేషన్ అందించడం ప్రారంభించారు.

మొదటిసారి ఈ స్కీమ్‌ను 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు అమలు చేశారు. తర్వాత దీన్ని 2021 నవంబర్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి స్కీమ్ గడువు పొడిగించారు. 2022 మార్చి నెల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది. 80 కోట్ల కుటుంబాలకు ఉచిత రేషన్ లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్‌కు ఈ బియ్యం అదనం.