ట్రంప్‌ రాక..మురికివాడ కనబడకుండా గోడ !

modi-trump
modi-trump

అహ్మదాబాద్‌: ఈనెల 24, 25 తేదీలో అమెరికా అధ్యక్షుడ ట్రంప్‌ భారత్‌ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన అహ్మదాబాద్‌లో ప్రధాని మోడితో లిసి రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్ వరకూ జరిగే రోడ్‌ షో జరగనుండగా, ఈ మార్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దతున్నారు. అయితే, రోడ్ షో జరగబోయే మార్గంలో ఉన్న ఓ మురికివాడను ట్రంప్‌నకు కనిపించకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దేవ్‌శరణ్‌ లేదా శరణ్యివాస్ అనే ఈ మురికివాడలో 500లకు పైగా గుడిసెలు ఉండగా 2,500 మంది నివాసం ఉంటున్నారు.

ఈ గుడిసెలను ట్రంప్‌ కంటపడకుండా ఉండటానికి రహదారి పొడవున దాదాపు అర కిలోమీటరు మేర 6 నుంచి 7 అడుగుల ఎత్తులో గోడ నిర్మాణం సాగుతోందని అధికారులు వెల్లడించినట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జ్‌కు వెళ్లే మార్గంలో గోడ నిర్మిస్తున్నట్టు తెలిపింది. ఈ గోడ నిర్మాణం పూర్తయిన తర్వాత రహదారి వెంబడి మొక్కలు నాటనున్నట్టు సదరు అధికారులు పేర్కొన్నారట. మొత్తం 16 రహదారులను మరమ్మతులు చేసి, విద్యుత్తు దీపాలతో అలంకరించనున్నారు. ఇందు కోసం గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ. 50కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్థానిక మీడియాలో ప్రచారం సాగుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/