5 లక్షల ఏకే-203 రైఫిళ్లను ఉత్పత్తి చేసేందకు ప్రభుత్వం ఆమోదం
Govt approves plan to manufacture 5 lakh AK-203 rifles in UP’s Amethi
న్యూఢిల్లీ: రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా సుమారు అయిదు లక్షల ఏకే-203 అజాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారీ చేయనున్నారు.
7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే-203 రైఫిళ్లను.. ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాస్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్ధాల నుంచి వాడుతున్నారు. ఏకే-203 సామర్థ్యం సుమారు 300 మీటర్లు ఉంటుంది. ఈ తుపాకీ బరువు చాలా తేలికగా ఉంటుంది. చాలా సులువైన రీతిలో దీన్ని వాడవచ్చు. ఏకే-203 రైఫిల్‌లో ఉన్న టెక్నిక్ కూడా సరళమైందని, పోరాటాల వేళ సైనికులు అత్యంత కచ్చితత్వంతో ఈ రైఫిళ్లను వాడవచ్చు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/