నేడు రాష్ట్రపతికి గవర్నర్ విందు

నేడు రాష్ట్రపతికి గవర్నర్ విందు
Ramnath Govind

Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఇవాళ గవర్నర్ తమిళిసై విందు ఇవ్వనున్నారు.  రాజ్‌భవన్‌లో రాత్రి 7:30 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ దంపతులకు గవర్నర్‌ తమిళిసై విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మొబైల్ యాప్‌ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఈ విందు కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/