వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్‌

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

వరంగల్‌: తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని గవర్నర్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఆమె కొనియాడారు. తలసేమియా బాధితులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య తెలంగాణకు కోసం అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వరంగల్‌ అర్బన్‌శాఖ ఆధ్వర్యంలో జూనియర్‌ యూత్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులతో సమావేశమయ్యారు. రెడ్‌క్రాస్‌లో బ్లడ్‌బ్యాంక్‌, తలసేమియా వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు తగినన్ని పరికరాలు, సౌకర్యాలు ఉండటం గొప్ప విషయమని చెప్పారు. వరంగల్‌ జిల్లాలో తలసేమియా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. వరంగల్‌ పర్యటనలో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్ష, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సాదరంగా ఆహ్వానించారు. డప్పువాయిద్యాలు, గిరిజన సంప్రాదాయ నృత్యాలతో గూడెం వాసులు ఆమెకు స్వాగతం పలికారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/