అన్ని రంగాల్లో ముందడుగు వేయాలి

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం నేడు దేశం ముందు గర్వంగా నిలబడిందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. మోడల్ స్టేట్ కోసం పునాదులు వేసుకుందని, అందులో భాగంగా బంగారు తెలంగాణ నిర్మాణం జరిగిందని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ పండుగతో పాటు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను ఆమె రాష్ట్ర ప్రజలకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ ప్రకటనను విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో తాను కూడా భాగస్వామి అయినందు కు తనకు సంతోషంగా ఉందని ఆ మె పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో భాగంగా తన మార్గదర్శకత్వంలో సిఎం కెసిఆర్ అభివృద్ధి పథంలో పయనిస్తారన్న ఆ శాభావా న్ని ఆమె వ్యక్తం చేశారు. అ న్ని రంగాల్లో రాష్ట్రం ముందుకెళ్లాలని అందరూ ఆయురారో గ్యాలతో ఉం డాలని ఆమె ఆకాంక్షించారు. అన్ని పండుగలకు ఈ ప్రభుత్వం సమాన అవకాశం కల్పించిందని, దీంతో సమాజంలో ప్రభుత్వంపై గౌరవం పెరుగుతుందన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/