కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న గవర్నర్ తమిళసై

గవర్నర్ తమిళి సై ప్రస్తుతం సిద్దిపేట లో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ కు పూర్ణకుంభంతో ఆలయ అధికారులుస్వాగతం పలికారు. మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్..రాష్ట్రంలోని ప్రజలు అందరూ ఆరోగ్యంగా.. సుఖసంతోషాలతో ఉండాలని కొమురవెల్లి మల్లన్నను కోరుకున్నట్లు తెలిపారు. కొమురవెల్లికి రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా.. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి త్వరగా పూర్తి చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.

ఇక గవర్నర్ పర్యటన ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం స్వాగతం పలికేందుకు సైతం ముందుకు రాలేదు. డీఆర్‌వో, ఆలయ అర్చకులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ అంశంలో అసంతృప్తి తెలుపుతూ ఇటీవల గవర్నర్ వ్యాఖ్యలు చేశారు. అయినా అధికారులు తీరు మార్చుకోవడం లేదు. కాగా.. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళిసై దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు. బైరాన్ పల్లి లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తర్వాత వీరబైరాన్ పల్లిలో ఉన్న చారిత్రాత్మక బురుజును గవర్నర్ సందర్శించారు.