నేడు ముస్లింలకు గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు

Governor Narasimhan
Governor Narasimhan

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ రంజాన్‌ ఉపవాసదీక్షల సందర్భంగా ఈరోజు ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 6.50 గం టలకు మొదలుకానున్న ఇఫ్తార్ విందుకు తెలంగాణ, ఏపి సిఎంలు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు వివిధ రంగాల ప్రముఖులు, ముస్లింలు హాజరుకానున్నట్లు రాజ్‌భవన్‌వర్గాలు తెలిపాయి.
మరోవైపు సిఎం కెసిఆర్‌ ఆదివారం సాయంత్రం ముస్లిం లకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. హైదరాబా ద్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగే ఇఫ్తార్ విం దుకు ఏర్పాట్లుచేస్తున్నారు. హోంమంత్రి మహమూద్‌అలీతోపాటు పలువురు మంత్రులు, ప్రముఖులు విందుకు హాజరుకానున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/