నెల వేతనం విరాళం ప్రకటించిన గవర్నర్‌

చెక్‌ రూపంలో సిఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇవ్వనున్నట్లు వెల్లడి

tamilisai soundararajan
tamilisai soundararajan

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కరోనాపై పోరుకు విరాళంను ప్రకటించారు.కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర ప్రజలందరికి మద్దతుగా నిలుస్తున్నాను. నా వంతు భాగస్వామ్యంగా ఒక నెల వేతనంను సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్‌ రూపంలో అందించనున్నాను. అని తమిళిసై ట్వీట్‌ చేశారు. తెలంగాణలో లాక్‌డౌన్‌ ను విదించినప్పటికి పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోందని, లాక్‌ డౌన్‌ని మరింత కఠినంగా అమలు చేయాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/