పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం
పీవీ మార్గ్‌ను ప్రారంభం
governor-and-cm-unveiled-pv-statue
హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపట్లో పీవీకి సంబంధించిన తొమ్మిది పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఇందులో పీవీ రాసినవి 4 ఉండగా, మిగతావి ఆయన జీవితాన్ని విశ్లేషించే పలువురు రాసినవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ పుస్తకాలను ముద్రించాయి.
కాగా, పీవీ శతజయంతి కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/