గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు షాక్‌ ఇవ్వనున్న సర్కారు!

Government weaves tax net for internet’s global biggies
Government weaves tax net for internet’s global biggies

న్యూఢిల్లీ: విదేశీ టెక్నాలజీ కంపెనీలకు త్వరలోనే ఇండియాలో ఒక పెద్ద షాక్ తగలబోతోంది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఈబే, అలీబాబా వంటి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీలపై కొత్త తరహా పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అది అమల్లోకి వస్తే ఇకపై భారత వాటి పన్ను రేటు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీలు విదేశీ సెర్వర్ల ద్వారా అక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న అంశాలపై పన్నులు చెల్లించటం లేదు. కానీ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇకపై ఎక్కడి సర్వర్లు ఉన్నా… భారత దేశంలో, మన డేటా ఆధారంగా జరిగే లావాదేవీలు, అడ్వార్టైజ్మెంట్ల పై పన్ను విధించాలని యోచిస్తోంది. గ్లోబల్ డిజిటల్ టాక్స్ అనే అంశంపై ప్రస్తుతం ఆర్గనైజషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఒక కొలిక్కి వస్తే ఇండియన్ గవర్నమెంట్ గూగుల్ సహా విదీశీ దిగ్గజ కంపెనీలపై కొత్త పన్ను విధించనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/