ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : ప్రధాని

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోడీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విషయం చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నూతన సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించామని చెప్పారు. రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహిస్తున్నామని చెప్పారు. అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా దేశం నలుమూలలా కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సమయంలో కలల సాకారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలు తమ వంతు సాయం చేస్తున్నారని చెప్పారు. ప్రజల సేవ.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు శుభ సంకేతమన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/