చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ యత్నం

Smart Phones
Smart Phones

ఢిల్లీ: దాదాపుగా అందరికీ సెల్‌ఫోన్‌ లేనిదే రోజు గడవదు. ఇప్పుడిది మనకు నిత్యావసర వస్తువుగా మారిపోయింది. భవిష్యత్‌ ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో ఒకడుగు ముందుకు వేయనుంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులకు చైనా అడ్డాగా మారిందని మనందరికీ తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు ఈ రంగంలో మరింత పటిష్టం మారి ప్రపంచ దేశాలకు స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేయాలని భారత్‌ యోచిస్తుంది. గతంలో మనం ఫోన్లన్నీ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాళ్లమన్న విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా పరిస్థితులు మారడంతో పెద్దపెద్ద కంపెనీలు భారత్‌కు వచ్చి తమ మొబైల్‌ ఫోన్లను తయారు చేయడం మొదలుకున్నాయి. ఇప్పటికే సామ్‌సంగ్‌, ఒప్పో, సెల్‌కాన్‌, వివో, రెడ్‌మీ వంటి కంపెనీలు మన దేశంలో ఫోన్లను తయారు చేస్తున్నాయి. అయితే ఆ జాబితాలోకి త్వరలోనే అమెరికా దిగ్గజం ఆపిల్‌ కూడా తన తయారీ సంస్థను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తుంది. అయితే కేంద్రం దృష్టి ప్రస్తుతం మేక్‌ ఇన్‌ ఇండియా పైనే కాకుండా ఫర్‌ ది వరల్డ్‌ అనే అంశంపై ఎక్కువగా ఆసక్తి చూపనుంది. ప్రస్తుత తయారీని పెంచి ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మొబైల్‌ ఫోన్‌ తయారీ కంపెనీలకు మెరుగైన ప్రోత్సాహాకాలు ఇచ్చి మరీ వారిని ఎగుమతులు పెంచేలా ప్రయత్నిస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/