నేడు తెరుచుకున్న ప్రభుత్వ కార్యాలయాలు

హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ కారణంగా సుమారు 50 రోజులపాటు విధులకు దూరంగా ఉన్న వివిధ శాఖల ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చారు. ఆరెంజ్, గ్రీన్, జోన్‌లలో వంద శాతం, రెడ్ జెన్‌లలో 33 శాతం మంది ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి తరుణంలో కార్యాలయాలవద్ద అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/