జాతీయ‌ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్

Government of Telangana Organizing Independence Day Celebrations at Golconda Fort

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంత‌కుముందు పోలీసుల గౌర‌వ వంద‌నాన్ని కేసీఆర్ స్వీక‌రించారు. గోల్కొండ కోట‌లో వెయ్యి మందికి పైగా క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ సందేశాన్ని సిఎం కెసిఆర్ ఇస్తున్నారు.

గోల్కొండ కోట‌కు చేరుకునే ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసి, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారితో పాటు ప‌లువురు నాయ‌కులు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/