ప్రభుత్వం మోసం చేసింది

Bhatti Vikramarka
Bhatti Vikramarka

హైదరాబాద్‌: ఆర్టీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని.. ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామని సీఎల్పి నేత భట్టివిక్రమార్క అన్నారు. ఈ అంశంలో అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటు తాజాగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. సీఎల్పీ కార్యలయంలో భట్టి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం, న్యాయస్థానాలపై సిఎం కెసిఆర్‌కు గౌరవం ఉన్న శాసనసభ, హైకోర్టు, ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజలతో పాటు హైకోర్టు, శాసనసభలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని భట్టి అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/