ఎల్‌టిటిఈపై హోంశాఖ ఐదేళ్ల నిషేధం

LTTE
LTTE

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఎల్‌టిటిఈపై నిషేధం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్‌ విడుదల చేసింది. నిషేధం ఐదేళ్ల పాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యానంతరం తొలిసారిగా భారత ప్రభుత్వం ఎల్‌టిటిఈని నిషేధించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/