కేంద్రం అతివిశ్వాసంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది..రాహుల్‌

కొత్త రకాల కరోనా కేసులపై మండిపాటు

న్యూఢిల్లీ: భారత్‌లోకి తాజాగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా కూడా ప్రవేశించినట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో తొలిసారిగా నలుగురు వ్యక్తులకు దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌ సోకిందని, మరొకరికి బ్రెజిల్‌ వేరియంట్‌ వైరస్‌ వచ్చిందని గుర్తించామని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ అతి విశ్వాసమే నష్టాన్ని కలిగించిందన్నారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పటిదాకా బ్రిటన్ రకం కరోనా కేసులు 187 నమోదయ్యాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/