మూడు రాజధానుల వల్ల పరిపాలన చాలా కష్టం

Kollu Ravindra
Kollu Ravindra

అమరావతి: రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చి తమ భూములను త్యాగం చేసిన ఘనత రాజధాని రైతులదని టిడిపి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరాతిని వైఎస్‌ఆర్‌పిపి మంత్రులు అవహేళన చేశారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌ ఎదో ఒక వంకతో రాజధానిని తరలించాలన్నదే ఆయన ఉద్దేశమని కోల్లు రవీంద్ర విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల వల్ల పరిపాలన చాలా కష్టమవుతుందన్నారు. ఒక వేళ రాయలసీమ ప్రజలు సచివాలయానికి వెళ్లాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నియమించిన జీఎన్‌ రావు కమిటీ సీఎం జగన్‌ కమిటీ అని ఎద్దేవా చేశారు. ఇంకా అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కొల్లు రవీంద్ర అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు టిడిపికి ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే రాయలసీమలో పరిశ్రమలు కూడా పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కొల్లు రవీంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/