చంద్రబాబు అమరావతి పర్యటనపై డీజీపీ స్పందన

Goutam Sawang
Goutam Sawang

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు అమరావతి పర్యటన సందర్భంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ పై చెప్పులతో, రాళ్లతో దాడిచేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ రాజధాని రైతులు, కూళీలు చంద్రబాబు రావోద్దంటూ ప్లెక్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌ పై చెప్పులు విసిరిన వ్యక్తి ఒకరు రైతు కాగా, రాళ్లు విసిరిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసి తాను నష్టపోయినట్లుగా చెబుతున్నారని పోలీసులు తెలిపారు. చంద్రబాబు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అందుకే అలా చేశామని వారు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఇంకా ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని కాని చెప్పులు, రాళ్లు వేయడం సరికాదు అన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా చంద్రబాబు పర్యటనలో పెద్దగా వివాదాలు జరగవని తెలిందని అందుకే ఆయనకు అనుమతి ఇచ్చామని డీజీపీ వివరణ ఇచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/