గోట‌బ‌య రాజ‌ప‌క్స‌కు సుప్రీంకోర్టు స‌మ‌న్లు జారీ

gotabaya-rajapaksa-summoned-by-srilanka-supreme-court-in-pardon-case-

కొలంబోః శ్రీలంక మాజీ అధ్య‌క్షుడు గొట‌బ‌య రాజ‌ప‌క్స‌కు ఆ దేశ సుప్రీంకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. శ్రీలంక పొడుజ‌న పెర‌మున పార్టీకి చెందిన దుమిండ సిల్వ‌కు క్ష‌మాభిక్ష పెట్టిన కేసులో రాజ‌ప‌క్స‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది రెండ‌వ సారి. 2011లో జ‌రిగిన ఓ మ‌ర్డ‌ర్ కేసులో సిల్వా నిందితుడు. అత‌నికి 2017లో మ‌ర‌ణ‌శిక్ష‌ను ఖ‌రారు చేశారు. మాజీ ఎంపీ ప్రేమ‌చంద్ర స‌న్నిహితుడిని సిల్వా హ‌త్య చేశాడు. అయితే జూన్ 2021లో అత‌నికి రాజ‌ప‌క్స క్ష‌మాభిక్ష పెట్టారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆ క్ష‌మాభిక్ష‌ను ర‌ద్దు చేసింది. సిల్వాను మ‌ళ్లీ అరెస్టు చేయాల‌ని ఆదేశించింది.

కాగా, డిసెంబ‌ర్ 16న రాజ‌ప‌క్స కోర్టుకు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. 73 ఏళ్ల రాజ‌ప‌క్స జూలైలో దేశం విడిచి పారిపోయిన విష‌యం తెలిసిందే. మాల్దీవుల‌కు వెళ్లిన ఆయ‌న సింగ‌పూర్ నుంచి త‌న రాజీనామాను ప్ర‌క‌టించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం త‌లెత్త‌డంతో రాజ‌ప‌క్స‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. దీంతో ఆయ‌న దేశం విడిచివెళ్లారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/