ఆయన పక్కన నిల్చోవడానికి కూడా భయపడుతున్నారు

బాలకృష్ణను చూసి హిందూపురం జనాలు బెంబేలెత్తుతున్నారు.. గోరంట్ల మాధవ్


అమరావతి: వైస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని… చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్ ను చంద్రబాబు వయోభారంతో తొక్కలేక తొక్కుతున్నారని అన్నారు.

బాలకృష్ణ రాత్రి ఫుల్ బాటిల్ కొడతారని, పగలు జనాలను కొడతారని మాధవ్ ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థంకాక… హిందూపురం జనాలు బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ఆయన పక్కన నిల్చోవడానికి కూడా వణికిపోతున్నారని అన్నారు. ఆయన చేత దెబ్బలు తిన్నవాళ్లు, బూతులు తిట్టించుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ఓటేసిన పాపానికి శిక్షను అనుభవించడానికి అభిమానులు సిద్ధంగా లేరని… అందుకే వారంతా వైస్సార్సీపీ వైపు చూస్తున్నారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/