“కోకో కోలా పెప్సీ జగనన్న ట్యాక్స్ సెక్సీ” పేరిట గోరంట్ల ట్వీట్‌

సినిమా థియేట‌ర్ల ప‌రిస్థితిపై సెటైరిక‌ల్ విమ‌ర్శ‌లు

అమరావతి : ఏపీలో భీమ్లా నాయ‌క్‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగానే వైస్సార్సీపీ స‌ర్కారు అడ్డుకుంటోంద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. జ‌న సైనికులు అయితే మ‌రింత ముందుకు వెళ్లి ఏకంగా వినూత్న నిర‌స‌న‌ల‌కు దిగుతున్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి అయితే ఈ వివాదంపై త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై ఓ మాస్ ట్వీట్ వ‌దిలారు. “కోకో కోలా పెప్సీ జగనన్న ట్యాక్స్ సెక్సీ” పేరిట ఆయ‌న వ‌దిలిన వ‌రుస ట్వీట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి.

జ‌గ‌న్ స‌ర్కారు తీరుతో సినిమా థియేట‌ర్ల వ‌ద్ద నెల‌కొన్న ప‌రిస్థితిని ప్ర‌స్తావిస్తూ ఓ జ‌గ‌న్ అభిమాని మాదిరిగా ఈ ట్వీట్‌ను బుచ్చ‌య్య వ‌దిలారు. ఈ ట్వీట్‌లో ఆయ‌న ఏమంటారంటే.. అయ్యా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాన్ని గుర్తించి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించారు సంతోషం. మరి ఇంకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకో కష్టం వచ్చింది. అది సినిమా మధ్యలో దాహం వేస్తే మన ప్రభుత్వమే కదా డ్రింక్ బాటిల్ కొనుక్కుని తాగుదామంటే ఆ బిల్లు చూసి గుండె జల్లు మంటుంది..జేబు కి చిల్లు పడుతుంది.

టికెట్లు రేట్లు 20 అయితే డ్రింక్ రేటు 150 ఉంది.. బయట ఏమో 40 రూపాయిలు ఉంటుంది.. అన్న జగనన్న…అని గట్టిగా పిలవాలని అనిపించింది..కానీ మధ్యలో పేర్ని నాని గారు గుర్తుకు వచ్చారు. సరే అదంతా కాదు జగనన్న తడాఖా ఏంటో చూపిస్తాం అని షాపు వాడికి చెప్పి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టా.. ఈ విషయంని పట్టించుకోగల సత్తా..దమ్ము ధైర్యం..మా జగనన్న కే ఉంది..ఉంటుంది…అన్న J ట్యాక్స్ ఎలా ఉంది అంటే ఇడ్లి 2 రూపాయిలు చెట్నీ 10 రూపాయిలు అన్నట్లు ఉంది… నువ్వు ఈ సమస్య ని పరిష్కరిస్తావు…తప్పకుండా.. అది కూడా అంతః కరణ శుద్ధితో…మీ పేరు @ysjagan ప్రఖ్యాతలు దేశం నలుమూలల వ్యాప్తి చెందాలని కోరుకుంటూ…ఆ బాబాయ్ దీవెనలు మనకి ఉండాలని…కోరుకుంటున్నాను” అని బుచ్చ‌య్య ఓ రేంజిలో త‌న ట్వీట్‌ను వ‌దిలారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/