ఉద్యోగుల నిర‌స‌న విజ‌య‌వంత‌మైంద‌ని ఓర్వ‌లేక‌పోతున్నారు

పోలీసుల‌పై కూడా జ‌గ‌న్ ఆగ్ర‌హంగా ఉన్నారన్న బుచ్చయ్య


అమరావతి: ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోలీసులు నిర్బంధాలను ఛేదించి ఛలో విజయవాడ కార్యక్ర‌మాన్ని విజయవంతం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గుర్రుగా ఉన్నారంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉద్యోగుల నిర‌స‌న విజ‌య‌వంతం కావడంతో జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నార‌ని, అందుకే ఏపీ అంతటా విద్యుత్ కోత‌లు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

పోలీసుల‌పై కూడా జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం దుర్మార్గ‌మ‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగుల‌ను అదుపు చేయ‌డంలో పోలీసులు విఫ‌ల‌మ‌య్యారంటూ పోలీసుల‌పై మండిప‌డ్డార‌ని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాల‌రాస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/