సిఎం కెసిఆర్‌తో ఎమ్మెల్యే గోపాల్‌

 Gopal MLA with CM KCR

Gopal MLA with CM KCR

విద్యానగర్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కెసిఆర్‌ను శనివారం కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపాల్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం శాలువాతో సత్కరించారు. అనంతరం ముఠాగోపాల్‌ మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. పేదల సంక్షేమం రైతుల పురోభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న కెసిఆర్‌ ఆశయాల సాధనకు నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని అర్హులందరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. మచ్చకుర్తి ప్రభాకర్‌తో పాటు పలువురు ముషీరాబాద్‌ టిఆర్‌ఎస్‌ నాయకులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.