ఇక‌పై గూగుల్‌ సెర్చ్‌ ఇమేజెస్‌లో కూడా యాడ్స్‌

Google
Google


గూగుల్‌ కొత్త ఫార్మాట్‌ అందుబాటులోకి
ఈ విషయంలపై త్వరలోనే స్పష్టత

మనం ఆన్‌లైన్‌లో ఏ వెబ్‌సైట్‌లోనైనా ప్రకటన ఇవ్వాలంటే చాలా మంది ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ గూగుల్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈక్రమంలోనే గూగుల్ త‌న అడ్వ‌ర్ట‌యిజ‌ర్లకు ప‌లు భిన్న ర‌కాల యాడ్ ఫార్మాట్‌ల‌ను అందిస్తున్నది. అయితే వాటికి తోడు ఇక‌పై గూగుల్ త‌న ఇమేజ్ సెర్చ్‌లో వ‌చ్చే ఇమేజ్‌ల‌లో కూడా యాడ్స్ ఇచ్చుకునేలా నూత‌న ఫార్మాట్ ను అందుబాటులోకి తేనుంది. ఈ క్రమంలో నెటిజ‌న్ల‌కు త్వ‌ర‌లో గూగుల్ సెర్చ్ ఇమేజెస్‌లో కూడా యాడ్స్ దర్శ‌న‌మివ్వ‌నున్నాయి. అయితే ఈ సేవ‌లు ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తాయో గూగుల్ వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో ఆ విష‌యంపై స్ప‌ష్ట‌త రానుంది.