పలు యాప్స్ ను నిషేధించిన గూగుల్

చట్టబద్ధ వ్యాపారులపై ప్రభావం పడుతుందన్న నిపుణులు

google
google

హైదరాబాద్‌: ఈ సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వచ్చిన ఎక్స్ పాండెడ్ ఫైనాన్షియల్ పాలసీ నిబంధనల మేరకు పలు ప్రిడేటరీ లోన్ యాప్స్ పై నిషేధం విధించామని, వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించామని గూగుల్ వెల్లడించింది. సంవత్సరానికి 36 శాతం కన్నా వడ్డీని అధికంగా వసూలు చేసే లోన్ యాప్స్ వినియోగదారులకు నష్టం చేకూర్చేవేనని గూగుల్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. వినియోగదారుల భద్రత రీత్యా వీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా, గూగుల్ తీసుకున్న నిర్ణయం, చట్టబద్ధంగా వ్యాపారం నడుపుకుంటూ, కస్టమర్ల అవసరాలను తీర్చే రుణ దాతలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆన్‌ లైన్‌ లెండర్స్‌ అలయన్స్‌ సీఈఓ మేరీ జాక్సన్‌ అభిప్రాయపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/