ప్రపంచ వ్యాప్తంగా గుగుల్‌లో ఉద్యోగా నియామకాలు?

google
google

శాన్‌ఫ్రాన్సిస్కో: భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3,800 మంది ఉద్యోగులను గూగుల్‌ 2020లో నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే తక్కువ జీతాలు ఇచ్చి థర్డ్‌పార్టీ ఉద్యోగులతో సంస్థను నడిపిస్తున్నట్లు విమర్శలు రావడంతో గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకొంది. భారత్‌లో గూగుల్‌ కస్టమర్‌ కేర్‌ సేవలను ఇక్కడి నుంచే అందిస్తోంది. 2020లో మేము విస్తరించనున్నాం. మిసిస్పిపీలో ఒక కార్యనిర్వహాక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము. భారత్‌, ఫిలిప్పీన్స్‌లో కూడా విస్తరణ జరుగుతుంది. మాకు ఇప్పటికే అందిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఈ విస్తరణ జరుగుతుంది. ఇప్పటికే గూగుల్‌ ఆపరేషన్‌ సెంటర్‌లో పనిచేస్తున్న 1,000 మంది ఏజెంట్లతో కలిపి మేము దాదాపు 4,800 కస్టమర్‌ కేర్‌ సపోర్ట్‌ ఉద్యోగాలను సృష్టిస్తాం అని గూగుల్‌ ఆపరేషన్‌ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రాయ్‌ డికెర్సన్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/