గూగుల్‌ ఎదుట ఉద్యోగుల ఆందోళన

Google employees protest
Google employees protest

శాన్‌ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌ తన ఉద్యోగులతో వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడంపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని కార్యాలయం ఎదుట నిరసన దిగారు. తాజాగా పరిణామాలు ఉద్యోగులకు గూగుల్‌ మాతృ సంస్థ ఆల్భాబెట్‌కు మధ్య నెలకొన్ని వివాదాన్ని తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు సంస్థ కార్పొరేట్‌ కల్చర్‌ను మొచ్చుకున్న ఉద్యోగులే ఇప్పుడు గూగుల్‌ వ్యవహరిస్తున్న తీరును తూర్పారబడుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన ఉద్యోగులను అణిచివేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దాదాపు 200 మంది ఉద్యోగులు శాన్‌ఫ్రాన్సిస్కో ఆఫీస్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/