ఇస్రో వ్యవస్థాపకుడికి గూగుల్‌ నివాళి

ఆయనను భారత అంతరిక్ష రంగ పితామహుడిగా పేర్కొంటారు

ISRO Founder Vikram Sarabhai
ISRO Founder Vikram Sarabhai

హైదరాబాద్: విక్రమ్ సారాభాయ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 1919, ఆగస్టు 12వ తేదీన పుట్టారు. ఆయనను భారత అంతరిక్ష రంగ పితామహుడిగా పేర్కొంటారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు.. భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం, ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి ఆయనను సారాభాయ్ ఒప్పించారు. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్‌సీఓఎస్‌పీఏఆర్) సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

విక్రమ్ సారాభాయ్ బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సర్ సీ.వీ.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. అనంతరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1945వ సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్‌డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత్ చేరుకున్నారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది. సారాభాయ్ భారత మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను రూపొందిచగా, అది రష్యనన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1966లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

విక్రమ్ సారాభాయ్ కుటుంబం విషయానికి వస్తేఉ ఇతని భార్య మృణాలిని సారాభాయ్. ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె మల్లికా సారాభాయ్. ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ. అయితే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ 100 వ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ తన వెబ్ లోగోతో సత్కరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/