నగరంలో గూగుల్‌ అతి పెద్ద క్యాంపస్‌ నిర్మాణం!

google campus in hyderabad
google campus in hyderabad


హైదరాబాద్‌: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ గూగుల్‌ త్వరలోనే నగరంలోని గచ్చిబౌలి నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికాకు వెలుపల గూగుల్‌ నిర్మించనున్న అతి పెద్ద కార్యాలయం ఇదే కావడం విశేషం. కేటిఆర్‌ చొరవ వల్లే గూగుల్‌ సంస్థ హైదరాబాద్‌లో నిర్మించాలని తలంచింది. మొత్తం 22 ఫ్లోర్లతో భవనాన్ని ఒకే బ్లాక్‌గా నిర్మించనున్నారు. వెయ్యి కోట్లతో ఈ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. దీనిలో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. కేటిఆర్‌ గూగుల్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే కార్యాలయం నిర్మాణానికి 7.2 ఎకరాల స్థలం కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం గూగుల్‌ తన ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ క్యాంపస్‌ను రెండున్నరేళ్లలో పూర్తి చేయనుంది. కొండాపూర్‌లోని కార్యాలయం గూగుల్‌ సొంత క్యాంపస్‌ కాదు, దాని లీజుకు తీసుకున్నారు. ఈ కార్యాలయం నిర్మాణంతో ఆ సంస్థకు కంపెనీ-ఓన్డ్‌ క్యాంపస్‌ కానుంది.