యాప్‌ స్టోర్‌ల నుంచి టిక్‌టాక్‌ యాప్‌ తొలగింపు

TIK TOK
TIK TOK

సాఫ్ట్‌వేర్‌ సంస్థలు గూగుల్‌, యాపిల్‌లు తమ తమ యాప్‌ స్టోర్‌ల నుంచి ప్రముఖ సోషల్‌ యాప్‌ టిక్‌టాక్‌ను తొలగించాయి. అసభ్యకర వీడియోలను ప్రమోట్‌ చేయడం, చిన్నారులను అపరిచిత వ్యక్తులు వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని చెబుతూ..టిక్‌టాక్‌ను నిషేధించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటి శాఖ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు గూగుల్‌, యాపిల్‌ల్కఉ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు తమ యాప్‌ స్టోర్‌ల నుంచి టిక్‌టాక్‌లను తొలగించాయి. ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో టిక్‌టాక్‌ కనిపించడంలేదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/