హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో మంచి ఫలితాలు.. ట్రంప్‌

donald trump
donald trump

వాషింగ్టన్‌: కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ డ్రగ్‌ చాలా బాగా పనిచేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ మందు కొన్ని దశాబ్దాలుగా మలేరియా చికిత్సకు ఉపయోగిస్తుండగా.. ప్రస్తుతం ఇది కరోనాకు కూడా పనిచేస్తుందని, మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు. కరోనా వైరస్‌ చికిత్సలో ఇతర థెరఫిలతో పాటు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ పైనా పరిశోధనలు జరుపుతున్నట్లు వెల్లడించారు. వాటి ఫలితాలను ప్రజలకు కూడా తెలుపుతామన్నారు. కాగా అమెరికా ఫెడరల్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం అంతకుముందే ఈ మందును కరోనా చికిత్సలో వాడేందుకు అంగీకారం తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/