‘ఉత్తర’కు మంచి రెస్పాన్స్

Uttara Success Meet
Uttara Success Meet

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందినసినిమా ‘ఉత్తర’. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఉత్తర కు రెస్సాన్ బాగుంది.మంచి సినిమా గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా కు వస్తున్న స్పందనను మీడియాతో పంచుకుంది చిత్ర యూనిట్..

ఈ సందర్భంగా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లుడుతూ : ‘ ఉత్తరకు మంచిరెస్పాన్స్ వస్తుంది. చూసిన ప్రేక్షకులు నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ మాకుచాలా ఆనందాన్ని కలిగించింది. సినిమా పబ్లిసిటీ, రిలీజ్ విషయాల్లో కొందరివ్యక్తులను నమ్మి మోసపోయాను ఆ విషయంలో బాధ పడుతున్నాను. మా సినిమా కురెస్పాన్స్ బాగున్నా థియేటర్స్ విషయంలో పోరాటం చేయాల్సి వస్తుంది.వరంగల్, కరీంనగర్ లలో థియేటర్స్ పెరుగుతున్నాయి. సినిమా నిర్మాణం లోరిలీజ్ అనేది చిన్న సినిమాలకు పెద్ద యుద్దం గా మారింది. ఈ పోరాటంలోఇండస్ట్రీ లోని కొందరి మనుషుల నిజ స్వరూపాలు చూసాను, మంచి సినిమాలనుబ్రతికించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకూ మా సినిమా ఇంతలా రీచ్అయ్యిందంటే కారణం మీడయా నే.. మాకు సహాకరించిన వారికి ధన్యవాదాలు ’అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ:‘ నిన్న శుక్రవారం విడుదలైన మా ఉత్తరకు చాలా మంచి స్పందన వస్తుంది. నేనుప్రేక్షకులతో ఈ సినిమాను చూసాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనుప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడింది విని చాలామంది కి వచ్చిన సందేహాలనుసినిమా తీర్చింది. నా నటన, హీరోయిన్ నటన బాగుందని సోషల్ మీడియాలోవస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక తెలంగాణా బ్యాక్డ్రాప్ వచ్చిన సహాజమైన ప్రేమకథ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ’ అన్నారు.

హీరోయిన్ కారుణ్య కత్రేన్ మాట్లాడుతూ:‘ ఈ సినిమా విషయంలో నేను ముగ్గురు కు థ్యాంక్స్ చెప్పాలి.. ఒకరు మాడైరెక్టర్ తిరుపతి యస్ ఆర్ గారు. స్వాతి లాంటి మంచి పాత్రను నాకుఇచ్చినందకు, రెండు మీడియాకి మాసినిమాను ఇంతవరకూ సపోర్ట్ చేసినందుకు,మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా సినిమా ప్రేక్షకులకు తెలిసింది. మూడుప్రేక్షకులకు సినిమా రిలీజ్ తర్వాత నాకు వస్తున్న రెస్పాన్స్ చాలాబాగుంది. స్వాతి, అశోక్ ల ప్రేమకథ అందరికీ నచ్చుతుంది. స్వాతి పాత్ర నాకుచాలా సంతృప్తి నిచ్చింది ’ అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/