ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం

AP CM YS Jagan Mohan Reddy

Amaravati: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభ ‘వార్త’ చెప్పింది . రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. అంతేకాదు , జాబ్‌ క్యాలెండర్‌లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. దీంతో గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్‌-2లో 182 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈమేరకు త్వరలో ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ కానుంది. ఇదిలా ఉండగా , 2020లో ఏపీపీఎస్సీ అప్పటికే మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్ధులను కొనసాగించాలని నిర్ణయించింది.

కాగా, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని అభ్యర్ధులు తాజాగా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 5 తప్పుడు ప్రశ్నలను సరిచేసి తర్వాత కొత్తగా మెయిన్స్ కు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధుల జాబితా తయారు చేయాలని ఆదేశించిందని గుర్తుచేశారు. తాజాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించి జాబ్ క్యాలెండర్​ను ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాకుండా , 2021 జూలై నుంచి 2022 మార్చి వరకు 10 ,143 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏ ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనే వివరాలతో జాబ్ క్యాలెండర్​విడుదల చేశారు.

తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/