ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’..

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’..

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేసిన జగన్ ..ఇప్పుడు బీమాకు సంబంధించి ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ని ప్రకటించారు. ఉచిత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యం, సహజ మరణం సంభవించినప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ ప్యాకేజి ఆదుకుంటుంది.

అలాగే మరణించిన ఉద్యోగుల పిల్లల విద్యారుణాలు, ఆడపిల్లల వివాహ రుణాల మాఫీ కూడా కల్పించింది. ప్రభుత్వం ఈ మేరకు ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ వల్ల రాష్ట్రంలో 50,500 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో పోలీసు శాఖలో ఈ తరహా ‘కార్పొరేట్‌ శాలరీ ప్యాకేజీ’ని అమలు చేస్తుండగా.. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా కల్పించింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై మరింత విపులంగా విధివిధానాలను రూపకల్పన చేయనుంది.