ట్రాక్టర్‌ కంపెనీలకు శుభవార్త!

tractor
tractor

ముంబై, : క్రిసిల్‌ రీసెర్చ్‌ విడుదలచేసిన రిపోర్ట్‌ప్రకారం దేశీయ ట్రాక్టర్‌ పరిశ్రమ ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ను కనబరచింది. 10నుంచి 12 శాతం వృద్ధితో 8 లక్షల యూనిట్ల అమ్మకాలను చేసింది. కాగా రానున్న 2020 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్‌ పరిశ్రమ మరింత వృద్ధిరేటును సాధించవచ్చని క్రిసిల్‌ పేర్కొంది. ప్రస్తుతం ఈ రంగంలో 6నుంచి 8శాతం వృద్ధి సాధించవచ్చని, రానున్న ఆర్థిక సంవత్సరంలో మరో 4నుంచి 6 శాతం ఇది పెరగొచ్చని క్రిసిల్‌ అంచనా. 2018లో ట్రాక్టర్ల అమ్మకాలు మందగించాయి. కానీ క్రమంగా వీటికి డిమాండ్‌ పెరగడం మొదలైంది.దీంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వీటన్నిటి కారణంగా 2020 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల డిమాండ్‌ మరింత పెరగనుంద.ఇ 2018లో ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల రైతులకు సుమారు రూ.60వేల కోట్ల రుణమాఫీలు చేశాయి. దీంతో అక్కడ ట్రాక్టర్లకు 2 నుంచి 4 శాతం వరకూ డిమాండ్‌ పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ట్రాక్టర్ల అమ్మకాలు 34నుంచి 40శాతం పెరిగాయి. ఇక రాబోయే రోజుల్లో సాధారణ రుతుపవనాలు, చెరకు పంట దిగుబడికూడా బాగుంటే దేశీయంగా ట్రాక్టర్ల అమ్మకాలు మరింత ఊపందుకుంటాయని ఆటో మోబైల్‌ రంగ నిపుణులు పేర్కొన్నారు.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/